News February 11, 2025

 అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

image

గంజాయి రవాణా కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాకవరపాలెం మండలం పైడిపాల జంక్షన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో గంజాయి గుర్తించామన్నారు. ఆ వాహనంలో 515 కేజీల గంజాయి పట్టుబడిందని.. దాని విలులు రూ.25,75,000 ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. నిందుతులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.

Similar News

News November 7, 2025

మరోసారి ‘నో హ్యాండ్ షేక్’!

image

భారత్, పాక్ క్రికెటర్ల మధ్య ‘నో హ్యాండ్ షేక్’ వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఆసియా కప్‌లో, మహిళల ప్రపంచ కప్‌లో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తెలిసిందే. ఇవాళ హాంకాంగ్ సిక్సెస్‌ టోర్నీలోనూ ఇది రిపీట్ అయింది. ఇండియా మ్యాచ్ <<18225529>>గెలిచిన <<>>కొన్నిక్షణాలకే ప్రసారం ముగిసింది. ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. రెండు టీమ్స్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని, తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే ఉండిపోయాయని సమాచారం.

News November 7, 2025

జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.

News November 7, 2025

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు ఉండవచ్చా?

image

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్మశానం నుంచి వెలువడే ప్రతికూల తరంగాలు నివాసితులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. ‘దహన సంస్కారాలు జరిగే చోటు నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుదలై పర్యావరణం కాలుష్యమవుతుంది. ఈ గాలి ఆరోగ్యానికి హానికరం. నిరంతరం అశాంతి, నిరాశ భావాలను పెంచుతాయి’ అని సూచిస్తారు. <<-se>>#Vasthu<<>>