News February 13, 2025

అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు

image

అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో మరో మూడు క్యాంటీన్లు అదనంగా ఏర్పాటు చేస్తారు. అలాగే కొత్తగా పాయకరావుపేట, మాడుగుల, చోడవరంలో క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి.

Similar News

News February 13, 2025

శ్రీకాకుళంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు: రాజగోపాలరావు

image

నేటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.కె.రాజగోపాలరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి లక్షణాలతో కోళ్లు మృతి చెందలేదని అన్నారు. జిల్లాలోని ప్రతి కోళ్ల ఫారంలు తనిఖీ చేయడానికి 68 రాపిడ్ యాక్షన్ టీమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. కోళ్ల పెంపకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News February 13, 2025

మోహన్ బాబుకు ముందస్తు బెయిల్

image

జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఊరట దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

News February 13, 2025

తాడిపత్రిలో శివలింగం కింద నీటిని ఎప్పుడైనా చూశారా!

image

అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అయితే అలంకరణలో ఉన్న సమయంలో దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగదు. పై ఫొటోలో శివలింగం కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు.

error: Content is protected !!