News April 7, 2025
అనకాపల్లి జిల్లాలో మరో ఐదు రోజులు వర్షాలు

ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో జిల్లాలో మరో ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News December 30, 2025
ఇంటి వద్దే వేడుకలు చేసుకోండి: కలెక్టర్

నూతన సంవత్సర వేడుకలను సామాజిక బాధ్యతతో, సంయమనంతో జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దే వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచి విలువలు ప్రతిబింబించేలా కొత్త ఏడాదిని స్వాగతించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
News December 30, 2025
పాలమూరు: సంపులో పడి 18 నెలల బాలుడి మృతి

మామిడి తోటలోని నీటి సంపులో పడి ఓ బాలుడి మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి మండలం మాచర్లలో చోటుచేసుకుంది. వంగూరు మండలానికి చెందిన మల్లేష్, మంజుల దంపతులు మాచర్లలో మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. మంగళవారం పనుల నిమిత్తం తమ 18 నెలల కుమారుడు హర్షిత్‌ను తోటలోకి తీసుకెళ్లారు. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
News December 30, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.1976, కనిష్ఠ ధర రూ.1976, వరి ధాన్యం 1010 గరిష్ఠంగా రూ.1950, కనిష్ఠ ధర రూ.1850, జైశ్రీరాం వరి ధాన్యం గరిష్ఠ ధర రూ.2711, కనిష్ఠ ధర రూ.2711 ధర పలికింది. నేడు మార్కెట్‌లో 32 బస్తాల కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.


