News December 12, 2025
అనకాపల్లి జిల్లాలో మరో భారీ పరిశ్రమ

అచ్యుతాపురం ఎస్ఈజెడ్ పరిధిలో గల రాంబిల్లి మండలంలో సోలార్ పలకల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలను కేటాయించింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. రూ.3,990 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేయనున్నారు. 2028 జనవరి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Similar News
News March 9, 2026
GREAT: 6 గంటలు శ్రమించి పులికి ఆపరేషన్ (PHOTOS)

పట్నా జూకు తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా ఢిల్లీ జూలోని ఏడాదిన్నర ఏళ్ల ‘దుర్గ’ అనే తెల్ల పులి రెండు కాళ్లు విరిగిపోయాయి. దీనికి ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ICAR) వైద్యులు అధునాతన ఆర్థోపెడిక్ పద్ధతులతో ఆపరేషన్ చేశారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ICAR దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.
News March 9, 2026
HYD: నేడు స్కాట్లాండ్‌తో భారత్ ఢీ

మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2026లో భాగంగా నేడు భారత్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. పూల్-బీలో ఇప్పటికే ఒక విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు స్కాట్లాండ్ జట్టు కీలక పాయింట్ల కోసం పోరాడనుంది. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గం.కు ప్రారంభం కానుంది.