News April 23, 2025

అనకాపల్లి జిల్లాలో రూ.59 కోట్ల బకాయి 

image

అనకాపల్లి జిల్లాలో ఉపాధి కూలీలకు నాలుగు రోజుల్లో రోజుల్లో వేతన బకాయిలు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు డ్వామా అధికారులు మంగళవారం తెలిపారు. గత 12 వారాల నుంచి కూలీలకు వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఈ నేపథ్యంలో కేంద్రం రూ.961 కోట్లను వేతన బకాయిల చెల్లింపుకు విడుదల చేసింది. అనకాపల్లి జిల్లాలో కూలీలకు సుమారు రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Similar News

News April 23, 2025

ఎంపీ కార్యాలయం పేరు మారిస్తే బాగుండు: కేశినేని నాని

image

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయానికి ఎన్టీఆర్ భవన్ పేరు మార్చి చార్లెస్ శోభరాజ్ భవన్ పేరు పెడితే బాగుంటుందని మాజీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ఎంపీ కేశినేని చిన్ని చేసే పనులు ఇసుక వ్యాపారం, ప్లై యాష్ తోలకం, భూ దందాలు, బ్రోకరేజ్‌లు, పేకాట, రేషన్ బియ్యం మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎంపీ కార్యాలయంలో చేస్తున్నారని మండిపడ్డారు.

News April 23, 2025

టెన్త్ ఫలితాలు.. ఒక్క మార్క్ మాత్రమే వచ్చింది!

image

ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ స్టూడెంట్‌కు షాకింగ్ ఫలితాలు వచ్చాయి. 600 మార్కులకు గాను ఒక్క మార్క్ మాత్రమే వచ్చింది. సైన్స్‌లో ఒక్క మార్కు రాగా, మిగతా 5 సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వచ్చాయి. దీంతో ఫలితాలు ఇలా రావడం ఫస్ట్ టైమ్ అనే చర్చ జరుగుతోంది.
*ప్రైవసీ దృష్ట్యా సదరు విద్యార్థి వివరాలను ఇక్కడ ఇవ్వట్లేదు.

News April 23, 2025

అలకూరపాడు జడ్పీ హై స్కూల్ విద్యార్థినికి 595 మార్కులు

image

టంగుటూరు మండలంలోని అలకూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 600 గాను 595 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచింది. ఈ సందర్భంగా బాలికను పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యశాఖధికారులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

error: Content is protected !!