News February 24, 2025
అనకాపల్లి జిల్లాలో రెండు రోజులు వైన్స్ బంద్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అనకాపల్లి జిల్లాలో మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన అనకాపల్లిలో మాట్లాడుతూ.. వచ్చేనెల మూడవ తేదీన(మార్చి 3) ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం షాపులను మూసివేస్తామన్నారు.
Similar News
News February 24, 2025
త్వరలో నెస్లే ఇండియా ఉత్పత్తుల ధరలు పెంపు

తమ ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచాలని Nestle India యోచిస్తోంది. కాఫీ, కోకో, వంట నూనెల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ MD సురేశ్ నారాయణన్ తెలిపారు. ద్రవ్యోల్బణం, అధిక ఉత్పత్తి ధరల కారణంగా తమకు లాభాలు తగ్గాయని పేర్కొన్నారు. కేంద్రం వ్యక్తిగత ఆదాయ పన్నులను తగ్గించడంతో వినియోగదారుల వద్ద డబ్బులు మిగులుతాయని, దీంతో తమ ఉత్పత్తుల వినియోగం పెరిగే ఛాన్సుందని అంచనా వేశారు.
News February 24, 2025
వికారాబాద్: 93ఎకరాల భూమి.. 62మందికి చెక్కులు

పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందించామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన రైతులకు నష్ట పరిహార చెక్కులను తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు. 93.16 ఎకరాల భూమికి 62 మంది రైతులకు నష్టపరిహారం అందించామన్నారు.
News February 24, 2025
ఏడాదిలో 300 రోజులు అదే తింటా: మోదీ

ఫూల్ మఖానా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఏడాదిలో 300 రోజులు అదే తింటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని చెప్పారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో మఖానా తింటున్నారు. దీని ఉత్పత్తి ఇంకా పెరగాలి’ అని పేర్కొన్నారు. కాగా బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు.