News March 23, 2025
అనకాపల్లి జిల్లాలో లారీ బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

మాడుగుల మండలం గాదిరాయిలో ఓ ట్రాలీ లారీ ఆదివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. గాదిరాయి వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి 3 బైకులను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైకులపై వెళ్తున్న ఐదుగురు తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ నారాయణరావు చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 25, 2025
Star Health ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌లో తప్పిదాలు..!

స్టార్‌హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రాక్టీసెస్‌లో తప్పిదాలను IRDAI గుర్తించినట్టు తెలిసింది. విచారణ ముగిశాక సంస్థపై చర్యలు తీసుకుంటుందని సమాచారం. 8-10 జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో IRDAI రీసెంటుగా తనిఖీలు చేపట్టింది. క్లెయిమ్స్ తిరస్కరణ, ఆమోదం, లేవనెత్తిన సందేహాలు, డిడక్షన్లను పరిశీలించింది. మరోవైపు స్టార్‌హెల్త్‌కు వేర్వేరు జోనల్ ఆఫీసుల నుంచి 25GST నోటీసులు రావడం గమనార్హం.
News March 25, 2025
మంచిర్యాల: మంచిగా పని చేస్తే గుర్తింపు వస్తుంది: CP

చట్టబద్ధంగా మంచిగా పని చేసినప్పుడు తప్పక గుర్తింపు వస్తుందని CP అంబర్ కిషోర్ ఝా అన్నారు. నెలవారి సమీక్షలో భాగంగా సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. CPమాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై స్టేషన్ అధికారులకు ముందస్తు సమాచారం ఉండాలన్నారు. ప్రతి కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, SC,ST కేసుల్లో న్యాయంగా, పారదర్శకంగా విచారణ జరపాలని సూచించారు.
News March 25, 2025
BREAKING: దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు గల్లంతు

నల్గొండ జిల్లా దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నేటి ఉదయం ఆరుగురు యువకులు దండెంపల్లి SLBC కాలువలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.