News March 12, 2026
అనకాపల్లి జిల్లాలో వారందరి ఖాతాల్లో రూ.134 కోట్లు జమ!

అనకాపల్లి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద 2,42,536 మంది లబ్ధి కలుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. వీరి ఖాతాల్లో ఈ నెల 13న రూ.134.27 కోట్లు జమ అవుతాయన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,202 మంది, చోడవరంలో 51,269, మాడుగుల 45,604, ఎలమంచిలి 33,648, నర్సీపట్నంలో 35,147, పెందుర్తి 15,364, పాయకరావుపేటలో 39,302 మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.
Similar News
News April 13, 2026
ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
News April 13, 2026
ఇంటర్ రిజల్ట్స్.. మార్క్ మెమోలో తప్పులున్నాయా?

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ మెమోలో ఏవైనా తప్పులుంటే 10 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా లేదా హెల్ప్ డెస్క్ ఈమెయిల్(helpdesk-ie@telangana.gov.in)కు కంప్లైంట్ ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇక ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. జ్యోతిబాఫూలే స్టూడెంట్స్ 90% ఉత్తీర్ణత సాధించారు.
News April 13, 2026
భిక్కనూరులో దారుణం.. వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోపిడి

భిక్కనూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై రోకలిబండతో దాడి చేశాడు. ఆమె అరుస్తుండగా బంగారు ఆభరణాలు అపహరించి పరారయ్యాడు. దాడిలో వృద్ధురాలికి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


