News March 31, 2025
అనకాపల్లి జిల్లాలో సోషల్ పరీక్షకు 11,700 మంది: డీఈవో

అల్లూరి జిల్లాలో మంగళవారం జరగనున్న సోషల్ స్టడీస్ పరీక్ష జిల్లాలో 71 కేంద్రాల్లో జగనుందని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,700 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం పాఠశాలలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించినప్పటికీ పది పరీక్ష యథావిధిగా జరుగుతుందన్నారు. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుంది.. అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Similar News
News April 2, 2025
రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్

విజయవాడ రైల్వే డివిజన్‌కు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,386.61 కోట్ల స్థూల ఆదాయం లభించిందని డివిజన్ రైల్వే మేనేజర్(DRM) నరేంద్ర పాటిల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ఓ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక ఆదాయమన్నారు. 38.322 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.4,239.74 కోట్ల ఆదాయం డివిజన్‌కు లభించిందని DRM పేర్కొన్నారు.
News April 2, 2025
ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
News April 2, 2025
చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్: CM

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి అభ్యర్థన మేరకు చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే చినగంజాంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు కృషి చేస్తామన్నారు. కొమ్ముమూరి కాలువ ఆధునికీకరణ, మండలంలో డిగ్రీ కళాశాల నిర్మాణం, మినీ స్టేడియం, మోటుపల్లి నుంచి కారిడార్ నిర్మాణానికి సీఎంకు ఎమ్మెల్యే విన్నవించారు.