News April 1, 2025

అనకాపల్లి జిల్లాలో 157 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు 157 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,679 మంది హాజరైనట్లు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 256 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 194 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News September 14, 2025

సృష్టి కేసులో విశాఖలో సిట్ తనిఖీలు

image

తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సృష్టి కేసులో విశాఖలోని 2 చోట్ల సిట్ అధికారులు, తెలంగాణ సిట్ బృందం
తనిఖీలు చేపట్టారు. నగరంలోని సృష్టి కార్యాలయం, ఆసుపత్రిలో రాత్రి 12:00 వరకు తనిఖీలు కొనసాగాయి. జిల్లా వైద్య అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించి తనిఖీలు చేపట్టగా విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేజీహెచ్ డాక్టర్లు ముగ్గురు సస్పెండ్ కాగా మిగతావారి పాత్ర తేలాల్సి ఉంది.

News September 14, 2025

అమరావతిలో NTR విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధం

image

అమరావతి రాజధాని లో NTR విగ్రహం, ఐకానిక్ వంతెన నిర్మాణంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే NTR స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ఉద్దేశం చేశారు. శనివారం ఉండవల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం నమూనాలను సీఎం పరిశీలించారు. అమరావతిలో నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.

News September 14, 2025

వికారాబాద్: అదాలత్‌‌లో 26,965 కేసుల పరిష్కారం

image

రాజీయే రాజమార్గమని, రాజీతో కక్షదారులిద్దరూ గెలుస్తారని జిల్లా చీఫ్ జడ్జి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చిందన్నారు. VKB, పరిగి, తాండూరు, కొడంగల్ కోర్టుల పరిధిలో మొత్తం 26,965 కేలులు పరిష్కరించినట్లు వీటిల్లో ట్రాఫిక్ చలాన్లు, డ్రంక్ & డ్రైవ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, ఈ పిట్టీ కేసులు, తగాదాలు, సైబర్ క్రైమ్ వంటి కేసుల్లో రాజీ కుదిర్చినట్లు తెలిపారు.