News February 5, 2026
అనకాపల్లి జిల్లాలో 2 మద్యం బార్లకు లైసెన్స్ మంజూరు

అనకాపల్లి జిల్లా పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించినట్లు డీఆర్వో వై. సత్యనారాయణ తెలిపారు. 10 దరఖాస్తులకు డ్రా నిర్వహించగా ఇద్దరికీ లాటరీ తగిలినట్లు తెలిపారు. డ్రాలో ఎంపికైన అభ్యర్ధులు పూర్తి స్థాయి ఫీజును వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Similar News
News February 5, 2026
రైల్వే జోన్‌పై కేంద్రం చిన్నచూపు.. విశాఖ వాసుల ఆవేదన

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. 2026 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ. 170 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.3,500 కోట్ల అంచనా వ్యయం ఉన్న ఈ ప్రాజెక్టుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవని, జోన్ నిర్మాణంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నామమాత్రపు కేటాయింపులతో జోన్ కల నెరవేరడంపై విశాఖ ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
News February 5, 2026
జి.మాడుగులలో బైకు, జీపు ఎదురెదురుగా ఢీ

జి.మాడుగుల(M) అనర్బా వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మద్దిగరువు నుంచి వస్తున్న జీపు, పాడేరు నుంచి వెళ్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొన్నట్లు స్థానికులు. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న కిల్లంకోటకు చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వారిని జి.మాడుగుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2026
చొప్పదండికి సీఎం రేవంత్ రెడ్డి రాక

చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. సీఎం వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనగా, పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.


