News August 20, 2025

అనకాపల్లి జిల్లాలో 2,000 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు

image

అనకాపల్లి జిల్లాలో 2,000 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు తెలిపారు. మంగళవారం నాటికి జిల్లాలో పదివేల హెక్టార్లలో వరి నాట్లు పూర్తయినట్లు పేర్కొన్నారు. రోజుకు మూడువేల హెక్టార్లలో వరినట్లు వేస్తున్నట్లు తెలిపారు. ఈనెలాఖరుకు 40,000 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. దమ్ములో యూరియా వేయవద్దని సూచించారు.

Similar News

News March 30, 2026

వరంగల్: స్కూల్స్‌లో అత్యవసర ఫోన్ నంబర్ల బోర్డులు!

image

సర్కారు బడుల్లో అత్యవసర ఫోన్ నంబర్ల బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.12.66 లక్షలు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలోని 2,533 పాఠశాలలకు ఓక్కో స్కూల్‌కు రూ.500 కేటాయించింది. ఈ బోర్డులో హాస్పిటల్, పోలీసు, ఫైర్, MEO, DEO, కలెక్టర్, HM నంబర్లు ఉంటాయి. HNKలో 333 పాఠశాలలకు రూ.1,66,500, WGL-404కు రూ.2,02,000, ములుగు-375కు రూ.187500, MHBD-739కు రూ.369500, జనగామ-345JI రూ.172500, BHPL-337కు రూ.168500 మంజూరయ్యాయి.

News March 30, 2026

విశాఖ: హైవేపై బీటెక్ స్టూడెంట్ మృతి

image

తగరపువలస సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి ధరన్‌శ్రీ ఆదివారం అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురానికి చెందిన ధరన్ ఇక్కడ కళాశాలలో చదువుతుండగా స్నేహితులను కలుసుకునేందుకు హాస్టల్ నుంచి బయటికి వెళ్లి ప్రమాదానికి గురైనట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.

News March 30, 2026

నేను సినిమాలే చూడను: ఆమిర్ ఖాన్

image

తనకు సినిమాలు చూసే అలవాటే లేదని చెప్పి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్నతనం నుంచి క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెరగడంతో సినిమాల కంటే పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. పాత తరం నటుల చిత్రాలు తప్ప ప్రస్తుత ట్రెండ్ సినిమాలపై తనకు పెద్దగా అవగాహన లేదన్నారు. చిన్నప్పుడు సినిమా చూసేందుకు ఇంట్లో అనుమతించేవారు కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.