News March 31, 2025
అనకాపల్లి జిల్లాలో 40.9 డిగ్రీల ఉష్టోగ్రత

అనకాపల్లి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు సోమవారం కాస్త శాంతించాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పరిమితమయ్యాయి. సోమవారం మాడుగులలో 40.9డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. 3 మండలాల్లో తీవ్రవడగాలులు, 15 మండలాల్లో వడగాలుల వీచాయి. వేసవిలో అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
Similar News
News April 2, 2025
కడవెండికి చేరుకున్న మావోయిస్టు రేణుక మృతదేహం

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన ఎడిటర్ ప్రభాత్ పత్రిక సంపాదకురాలు గుమ్మడివెల్లి రేణుక ఎన్‌కౌంటర్‌లో సోమవారం మృతి చెందారు. కాగా, బుధవారం తెల్లవారుజామున సొంత గ్రామం కడవెండికి రేణుక మృతదేహం చేరుకుంది. మధ్యాహ్నం అంతిమ యాత్ర ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కామ్రేడ్ రేణుకను కడసారి చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారని పేర్కొన్నారు.
News April 2, 2025
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్న వైసీపీ

వక్ఫ్ సవరణ బిల్లుకు YSRCP వ్యతిరేకంగా ఓటు వేయనుంది. లోక్ సభ, రాజ్యసభ రెండింట్లోనూ ఈ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించింది. తాము రాజకీయంగా దెబ్బతిన్నా సరే ఈ బిల్లును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని స్పష్టం చేశారు. అటు ఈ బిల్లుపై టీడీపీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడింటిని కేంద్రం ఆమోదించింది. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నిపుణులతో చర్చించారు.
News April 2, 2025
బయ్యారంలో వింత వ్యాధితో మరణిస్తున్న గొర్రెలు

బయ్యారం మండల కేంద్రంలో వింత వైరస్‌తో గొర్రెలు చనిపోతున్నాయని యాదవులు వాపోతున్నారు. గొర్రెలు, మేకలే జీవనాధారంగా అప్పులు చేసి గొర్రెలు కొనుగోలు చేసి తీరా నోటికాడికి వచ్చే సమయంలో సుమారు 50 శాల్తీలు మరణించడం వల్ల రూ.5లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వ్యాధి నిర్ధారణ కాక, ప్రభుత్వం మందులు ఉండకపోవడంతోనే గొర్రెలు మరణిస్తున్నాయని, ఒక్కో గొర్రెకు రూ.5-6 వేల వరకు మందులు వాడుతున్నా ఫలితం లేదన్నారు.