News March 11, 2025
అనకాపల్లి జిల్లాలో 601 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 601 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారిణి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 14,462 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 13,861 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్‌కు సంబంధించి 2,406 మంది, జనరల్‌కు సంబంధించి 11,455 మంది హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News February 12, 2026
అమలాపురం: ఆన్‌లైన్ మోసం.. ఆర్ఎంపీ వైద్యుడి ఖాతా ఖాళీ!

అమలాపురానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఫేక్ ‘నాప్తాల్’ సైట్‌లో రూ. 2,000 పెట్టి ఫోన్ కొని సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఫోన్ పనిచేయకపోవడంతో వారిని సంప్రదించగా, రీఫండ్ ఇస్తామని నమ్మించి బ్యాంక్ వివరాలు, రెండుసార్లు ఓటీపీలు తీసుకున్నారు. దీంతో బాధితుడి ఖాతా నుంచి రూ. 99,000 మాయం చేశారు. బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News February 12, 2026
ఖమ్మం జిల్లాలో టాప్ కల్లూరు

కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. జిల్లాలోనే అత్యధికంగా 87.08 శాతం పోలింగ్ నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. రామదుర్గారెడ్డి వెల్లడించారు. మొత్తం 18,866 ఓట్లకు గానూ 16,428 ఓట్లు పోలయ్యాయి. 20 వార్డుల్లో నిర్వహించిన పోలింగ్‌లో 6వ వార్డు 94.85 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, 20వ వార్డులో 75.85 శాతం పోలింగ్ నమోదైంది.
News February 12, 2026
బాడంగి: ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి

బాడంగి మండలం రావివలస గ్రామానికి చెందిన అప్పలస్వామి (70) మంగళవారం ఉత్తరవల్లిలో బంధువులు ఇంటికి వెళ్లాడు. అప్పలస్వామి వెళ్లి రోజు గడిచినా ఇంటికి రాకపోవడంతో కుమారుడు ఆచూకీ కోసం వెతకగా ఊరు సమీప చెరువులో మృతదేహం కనిపించింది. చెరువులో ఉన్న డెడ్ బాడీ తన తండ్రిదేనని కుమారుడు గుర్తించాడు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసుకు బుధవారం ఫిర్యాదు చేశాడు. హెచ్‌సీ ప్రసాదరావు కేసు నమోదు చేశారు.


