News September 23, 2025
అనకాపల్లి జిల్లాలో 94 సైబర్ కేసులు: ఎస్పీ

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఈ ఏడాది జూలై 1 నుంచి ఇప్పటివరకు 94 సైబర్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు రూ.93.78 లక్షలను ఫ్రీజ్ చేశామన్నారు. అలాగే రూ.15.45 లక్షల మొత్తాన్ని బాధితులకు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News September 23, 2025
మేడారం చరిత్రలో తొలిసారి.. జాతరకు ముందే CM రాక

మేడారం మహాజాతర చరిత్రలో కొత్త అంశం చేరనుంది. 4 రోజులపాటు జరిగే ఈ ‘జనజాతర’కు రాష్ట్ర ముఖ్యమంత్రులు రావడం పరిపాటే. మేడారం జాతరను 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అమ్మల దగ్గరకు CMల రాక మొదలైంది. కాగా, ఇది ఆచారంగా మారి CMలందరూ జాతర టైంలో వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. కానీ, తొలిసారిగా CM రేవంత్ జాతరకు ముందే వచ్చి జాతర నిర్వహణపై సమీక్షించనున్నారు. దీంతో మేడారం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి.
News September 23, 2025
SBIలో స్పెషలిస్ట్ పోస్టులు

<
News September 23, 2025
మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా: లోకేశ్

AP: శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా YCP నేత బొత్సపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా? సీనియర్ నేత అయ్యుండి బీఏసీలో ఎందుకు మాట్లాడలేదు? నన్ను డిక్టేట్ చేయడం సరికాదు’ అని ఆగ్రహించారు. తమ హయాంలో బకాయిలు పెట్టలేదని, లోకేశ్ మాటలు సరిగాలేవని బొత్స బదులిచ్చారు. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై YCP ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు.