News February 4, 2025

అనకాపల్లి జిల్లాలో 98.07 శాతం పింఛన్లు పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద అనకాపల్లి జిల్లాలో సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు 98.07 పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో లబ్ధిదారులు 2,57,457 మంది కాగా ఇప్పటివరకు 2,52,482 మందికి పింఛన్లను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 4,975 మందికి పింఛన్లు అందజేయాల్సి ఉందన్నారు.

Similar News

News December 25, 2025

చిత్తూరు జిల్లాలో 94.12% పల్స్ పోలియో వ్యాక్సిన్ పూర్తి

image

చిత్తూరు జిల్లాలో 94.12% పల్స్ పోలియో పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 2,22,502 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం, సోమ, మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేశారు. మంగళవారం ఈ కార్యక్రమం పూర్తవ్వగా జిల్లా వ్యాప్తంగా 2,08,470 మందికి పోలియో చుక్కలు వేశారు.

News December 25, 2025

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు వైద్య పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో చిన్నారుల ఆరోగ్యానికి మరోసారి ఇచ్చేందుకు చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సైతం జిల్లా వ్యాప్తంగా DMHO డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 0 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులు 4,04,091 మంది ఉండగా, బాల్యంలో వ్యాధులు ఉన్నవారిగా 314 మందిగా అధికారులు గుర్తించారు.

News December 25, 2025

ఓ వెబ్ సిరీస్.. 8 వేల ఉద్యోగాలు, $1.4 బిలియన్లు!

image

పేరుకు తగ్గట్టే ‘Stranger Things’ సిరీస్ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రేక్షకులను అలరిస్తూనే 2016 నుంచి ఇప్పటిదాకా $1.4B మేర అమెరికా GDPకి దోహదపడింది. 8 వేల జాబ్స్ కల్పించింది. ఆ సిరీస్‌లో చూపిన ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తడంతో టూరిజం ఆదాయం భారీగా వచ్చింది. అందులో కనిపించిన ఫుడ్ ఐటమ్స్, బొమ్మలు, వీడియో గేమ్స్, పాటలకూ డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ సిరీస్ 120 కోట్ల <<18400629>>వ్యూస్<<>> సాధించింది.