News August 30, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ మహిళలతో కలిసి RTC బస్సులో ప్రయాణించని హోంమంత్రి
➤ బైలపూడిలో భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
➤ జన్నవరంలో భూవివాదంలో తండ్రి కూతుర్లపై దాడి
➤ వసతి గృహాల విద్యార్థులకు దోమల తెరలు పంపిణీ
➤ దేవరాపల్లి ఎరువుల షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
➤ కోర్టు కానిస్టేబుళ్లు, CMS సిబ్బందితో SP సమీక్ష
➤ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
➤ కలిగొట్లలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ
Similar News
News August 31, 2025
కుప్పంలో బుల్లెట్ బైక్ నడిపిన మంత్రి నిమ్మల

కుప్పంలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు బుల్లెట్ బైక్‌పై సీఎం బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. పరమసముద్రం వద్ద హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి ఇచ్చే బహిరంగ సభకు వెళ్లగా.. మంత్రి నిమ్మల బుల్లెట్ బైక్‌పై ఈ సమావేశానికి వచ్చారు. టీడీపీ శ్రేణులకు అభివాదం ఆయన చేశారు.
News August 31, 2025
విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే!

విజయవాడలో ఆదివారం మాంసం ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ. 220, స్కిన్ కేజీ రూ. 210. చేపలు రాగండి కేజీ రూ. 200, బొచ్చ కేజీ రూ. 230. మటన్ కేజీ రూ. 900 వద్ద స్థిరంగా ఉంది. కోడిగుడ్లు 30 గుడ్ల హోల్‌సేల్ ధర రూ. 170కి పెరిగింది. (గతవారం రూ. 160). మరి ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News August 31, 2025
భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం నిలకడగా ఉంది. నిన్నటివరకు వేగంగా పెరిగిన వరద ప్రవాహం, నేడు 47.7 అడుగులకు చేరుకుని స్థిరంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం నీటిమట్టం నిలకడగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.