News March 6, 2026

అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

image

అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. శుక్రవారం అమరావతిలో జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. పెండింగ్ ప్రాజెక్టులపై, అభివృద్ధి పనులను సమీక్షించారు. నియోజకవర్గాల ప్రధాన సమస్యలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. స్పీకర్ అయ్యన్న, మంత్రులు అనిత, రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు కొణతాల, రాజు, బండారు, సుందరపు, పంచకర్ల పాల్గొన్నారు.

Similar News

News March 12, 2026

కరీంనగర్‌ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

image

కరీంనగర్(D)లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలన్నారు. సింగిల్‌ సిలిండర్‌కు 25 రోజులు, డబుల్‌కు 15 రోజుల గడువు ఉంటుందని తెలిపారు. గ్యాస్‌ పొందే సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 12, 2026

‘స్వర్ణ’ ఆఫీసుల్లో తరచూ తనిఖీలు

image

AP: స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డుల పనితీరు మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కలెక్టర్ నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు 8 కేటగిరీల అధికారులు నెలలో 3-12 సార్లు ఆ కార్యాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. అందుతున్న సేవలు, పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించాలని సూచించింది. సిబ్బంది పనితీరు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టిసారించాలంది.

News March 12, 2026

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీలోపే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీన రిజల్ట్స్ ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వాల్యుయేషన్ ఆలస్యమైతే మరో 2-3 రోజులు పట్టే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్రంలో FEB 25న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. కాగా ఈనెల 4 నుంచే వాల్యుయేషన్ ప్రక్రియ మొదలైంది.