News December 24, 2025

అనకాపల్లి: జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ నియామకం

image

అనకాపల్లి జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీని పార్టీ నియమించింది. ఉపాధ్యక్షులుగా కాయల మురళీధర్, తమరాన సింహాద్రి అప్పన్న, ఐ.ఆర్. వీ.రామారావు, జె.రాము, ఏ.అప్పలనాయుడు నియమితులయ్యారు. అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కే.శ్రీనివాసరావు, జి.కొండతల్లి, ఆర్.మాలతి, యు.దేముడిని.. పార్టీ అధికార ప్రతినిధులుగా బి.శ్రీనివాసరావు, ఎల్.పీ.లోవరాజు, ఎస్.మణి, కోశాధికారిగా జి.శాంతమ్మను నియమించారు.

Similar News

News December 25, 2025

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు హతం.. నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఒడిశా!

image

ఒడిశాలోని కందమాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు, నల్గొండ(D) పుల్లెంల వాసి గణేశ్ ఉయికె అలియాస్ పాక హన్మంతు ఉన్నారని తెలిపింది. 40 ఏళ్లుగా ఉద్యమంలో చురుగ్గా ఉన్న ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉంది. ఒడిశా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని, వచ్చే ఏడాది మార్చి 31కల్లా దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని పేర్కొంది.

News December 25, 2025

సిరిసిల్ల: కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ పదవులకు రేపే దరఖాస్తులు

image

కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యవర్గంలో పదవుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆశావాహులు తమ పేర్లను దరఖాస్తు ఫారం ద్వారా సమర్పించాలని సూచించారు. ఈ నెల 26న ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో టీపీసీసీ అబ్జర్వర్లు ఫక్రుద్దీన్, చైతన్య రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అందుబాటులో ఉంటారని తెలిపారు.

News December 25, 2025

కామారెడ్డి: మరో మూడు రోజులు శీతలమే

image

కామారెడ్డి జిల్లాలో మరో మూడు రోజుల పాటు చలి ప్రభావం ఎక్కువవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 8°C నుంచి 9.5°C అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, ఆరంజ్ అలర్ట్‌లో జిల్లా ఉండబోతుందని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. చల్లని వాతావరణంలో బయటకు రావడం తగ్గించాలన్నారు.