News December 19, 2025
అనకాపల్లి: జిల్లా పోలీసులను అలర్ట్ చేసిన ఎస్పీ

అనకాపల్లిలో గురువారం కెనరా బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. బ్యాంకులో దొంగతనానికి యత్నించిన దుండగులను పట్టుకోవడానికి ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక బృందాలను నియమించారు. సీసీ ఫుటేజీలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అనుమానితులపై ఆరా తీయాలని అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.
Similar News
News December 20, 2025
కుంటాల: 4 ఉద్యోగాలు సాధించిన వినయ్

కుంటాలకు చెందిన వినయ్ బాబు వరుస ఉద్యోగాలు సాధిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో విజయం సాధించారు. వినయ్ గతంలోనే FBO, జూనియర్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీగా ఎంపికై తన ప్రతిభను చాటుకున్నారు. గ్రూప్-3 సాధించాలనే పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన విజయం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ వినయ్‌ను ఘనంగా అభినందించారు.
News December 20, 2025
చిత్తూరు: తగ్గుతున్న చెరకు సాగు

చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ వాణిజ్య పంటగా ఉన్న చెరకు సాగు క్రమేపి తగ్గుతోంది. సాగు వ్యయం అధికమవుతుండడం, కూలీలు దొరక్క పోవడం, చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు క్రమేపి ఇతర పంటలకు మల్లుతున్నారు. సాగు చేసిన వారు తప్పనిసరిగా బెల్లం తయారు చేయాల్సి వస్తోంది. 2020లో ఉమ్మడి జిల్లాలో 9,900 హెక్టార్లలో చెరకు సాగు కాగా.. ప్రస్తుతం 6,500 హెక్టార్లలో మాత్రమే సాగులో ఉంది.
News December 20, 2025
MNCL: పంచాయతీ ఎన్నికల్లో జోరుగా మద్యం అమ్మకాలు

మంచిర్యాల జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలతో మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ఎన్నికలు ముగిసే సరికి జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 73 మద్యం దుకాణాల్లో సాధారణ రోజుల్లో నిత్యం రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. ఈ 11 రోజుల్లో రూ.35 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.


