News November 3, 2025
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. దీనిని ప్రారంభించిన ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ.. సమాజ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను ధారపోసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు వాటి పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Similar News
News November 4, 2025
HYD: BRS పాలనలో అవకతవకలు: మంత్రి

HYDలోని తెలంగాణ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. చేపల తినడం వల్ల ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచారం చేయాలని, గత BRS ప్రభుత్వ పాలనలో పంపిణీలో అవకతవకలు జరిగాయని, ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాల సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి, వివరాలను టి-మత్స్య యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.
News November 4, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కొండాపూర్‌లో దారుణ హత్య
> దేవరుప్పుల: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
> పాలకుర్తి: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
> జనగామలో నలుగురు దొంగల అరెస్ట్
> తుఫాన్ తో నష్టపోయిన పంటలను పరిశీలించిన కలెక్టర్
> బ్రిడ్జిలు నిర్మించాలని జనగామ కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన
> గూడ్స్ వెహికల్‌లో మనుషులను రవాణా చేయొద్దు: అధికారులు
> లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ప్రతిమ
News November 4, 2025
బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం

బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం అయింది. జాతరకు వచ్చే భక్తుల రక్షణ కోసం 175 మంది పోలీసు సిబ్బంది, 25 మంది ఎస్సైలు, సీఐలు, ఇతర ఉన్నత అధికారులు డీఎస్పీ సంపత్ రావు పర్యవేక్షణలో విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 50 మంది కార్మికులు పారిశుద్ధ్య నిర్వహణలో భాగస్వాములు అవుతారు. వ్యర్థాల నిర్వహణకు 6 ట్రాక్టర్లు, రోడ్లపై నీళ్లు చల్లడానికి 6 ట్యాంకర్లు పని చేయనున్నాయి.


