News February 14, 2026

అనకాపల్లి జిల్లా ప్రజా ప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు

image

అనకాపల్లి జిల్లాకి చెందిన MP, MLA, ఎమ్మెల్సీలకు మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. పలువురు నాయకులు తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతులపై లోకేశ్ చర్చించారు. అనంతరం అందరూ కలిసి డిన్నర్ చేశారు. స్పీకర్ అయ్యన్న, హోంమంత్రి అనిత, MP CM.రమేశ్, MLAలు కొణతాల, బండారు, తదితరులు ఈ విందులో పాల్గొన్నారు.

Similar News

News February 17, 2026

ఏడుపాయల రథోత్సవం.. ఆ ఊరు ప్రత్యేకం

image

ఏడుపాయల జాతరలో పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. వనదుర్గమ్మ ఆలయం ఇక్కడే ఉండటం విశేషం. జాతర చివరి రోజైన ఇవాళ జరిగే రథోత్సవంలో గ్రామానికి చెందిన 18 కులవృత్తుల వారు పాల్గొని సేవలు అందిస్తారు. ఆచారం ప్రకారం అమ్మవారి బొట్టును ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారిని ఘనంగా సత్కరిస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

News February 17, 2026

రోడ్లు శుభ్రంగా లేకుంటే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా: CM

image

TG: మున్సిపల్ అధికారులు, కమిషనర్లపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ‘త్వరలో GHMCలోని ప్రతి జోన్‌లో పర్యటిస్తా. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా. కమిషనర్లు, జోనల్ కమిషనర్‌లు పొద్దునే ఫీల్డ్‌లో ఉండాలి. చాలా మంది వెళ్లట్లేదు. అలాంటి అధికారులపై వేటు వేస్తా’ అని మున్సిపల్ శాఖ సమీక్షలో హెచ్చరించారు. GHMC 3 కార్పొరేషన్లలో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

News February 17, 2026

పాలమూరు: పెద్దపులి సంచారం

image

అచ్చంపేట(M) గుంపల్లి గ్రామ శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో ఓ రైతు ఏర్పాటు చేసుకున్న పాకలో కట్టేసి ఉన్న ఎద్దుపై అర్ధరాత్రి పెద్దపులి దాడి చేసి గాయపరిచిందని స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారం చుట్టుపక్కల వ్యాపించడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, అటవీశాఖ అధికారులు చేరుకొని పరిశీలిస్తున్నారు.