News December 14, 2025
అనకాపల్లి జిల్లా ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుందర్రావు

జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కె.సుందర్రావు (మాకవరపాలెం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షుడిగా ఆర్.గంగరాజు, కార్యదర్శిగా కె.ప్రేమ్ కుమార్, మహిళా కార్యదర్శిగా పీఆర్.కళ్యాణి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా బీ.ఉమారాణి, కోశాధికారిగా శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిలర్‌గా స్వామి ఎన్నికయ్యారు.
Similar News
News December 15, 2025
చిన వెంకన్న సన్నిధిలో రేపటి నుంచి ధనుర్మాస శోభ

ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ప.గో జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నెలగంట మోగనుండగా, 17 నుంచి స్వామివారి గ్రామోత్సవాలు మొదలవుతాయి. ఈ మాసమంతా ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై సేవను నిర్వహిస్తామని ఈవో ఎన్వీఎస్‌ఎన్ మూర్తి వెల్లడించారు.
News December 15, 2025
బిట్రగుంట: రైలు ఢీకొని తెగిపడిన యువకుడి తల

బిట్రగుంట రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. 20 – 25 ఏళ్ల వయస్సుగల యవకుడు రైలు వచ్చేసమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈఘటనలో యువకుడి తల తెగిపడింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినవారు కావలి రైల్వే పోలీసులను సంప్రదించగలరు.
News December 15, 2025
కనకాంబరం సాగుకు అనువైన రకాలు

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.


