News February 4, 2026
అనకాపల్లి: టీడీపీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

టీడీపీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పునరుద్ఘాటించారు. బుధవారం అనకాపల్లిలో జరిగిన టీడీపీ జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు, మరో 40 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
Similar News
News February 16, 2026
మహిళలూ ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో వృత్తి, ఉద్యోగాల కారణంగా మహిళలు క్యాబ్స్‌లో ప్రయాణించడం ఎక్కువైంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డ్రైవర్ ఐడీ, లైసెన్స్ ప్లేట్ మీరు బుక్ చేసిన డేటాతో సరిపోలాలి. ట్రిప్ వివరాలు, లైవ్ ట్రాకింగ్ సన్నిహితులకు పంపడం మంచిది. గుర్తింపు ఉన్న క్యాబ్ సర్వీసులనే ఎంచుకోవాలి. పరిసరాలు గమనిస్తూ అలర్ట్‌గా ఉండాలి. వెనుక సీట్‌లోనే కూర్చోవాలి. తెలియనివారికోసం డోర్లు తెరవకూడదు.
News February 16, 2026
ఇలా అయితే ఆక్వా మనుగడ కష్టమే!(1/3)

ట్రేడర్ల చేతిలో, సిండికేట్ల చేతిలో నిలువునా దోపిడీకి గురవుతున్న ఆక్వా రైతులకు రాయితీలు కూడా అందని ద్రాక్షగానే మిగిలాయి. కనీసం ఫ్యాన్లు, ఏరియేటర్లు వంటి వాటిని కూడా రైతులకు రాయితీపై అందించడం లేదు. రూ.1.50 యూనిట్ విద్యుత్ ఛార్జ్ అని కేవలం అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం పట్ల సాగు చేసే అందరి రైతులకు ఉపయోగపడటం లేదు. చెరువుల అనుమతుల విషయంలోనూ ప్రభుత్వాలు ఏమాత్రం రాయితీలు అందించిన పాపాన పోవడం లేదు.
News February 16, 2026
పెట్టుబడి ధరలు ఫుల్.. మద్దతు ధరలు నిల్..!(2/3)

ఆక్వా రైతులకు పెట్టుబడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫీడ్ తయారు చేసే సోయాబీన్ ధరలు తగ్గుముఖం పట్టినా రూ.60 వేలు ఉండే టన్ను ఫీడ్ ధర రూ. 90 వేలకు ఎగబాకింది. చెరువుల వద్ద ఏర్పాటు చేసే ట్రాన్సఫార్మర్ 40 కేవీ ధర 1.50 లక్షలు, 60 కేవీ ధర 2.50 లక్షలు గతంలో ఉండేది. ప్రస్తుతం అదే ట్రాన్సఫార్మర్ 60 కేవీ ధర రూ.5 లక్షలు అవుతుంది. ఇంతా భరించి పంట పండించినా సరైన ధర రాకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు.


