News March 8, 2025
అనకాపల్లి: టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 31 వరకు ఆయా తేదీల్లో ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నట్టు DPTO పద్మావతి తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి సొంతూరు నుంచి పరీక్షా కేంద్రానికి, పరీక్ష రాసిన తరువాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు పల్లె వెలుగు,ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నామన్నారు. బస్సు ఎక్కినప్పుడు హాల్ టికెట్ చూపించాలన్నారు.
Similar News
News April 5, 2026
TG EAPCETకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల (లేట్ ఫీజు లేకుండా) గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 53.34% మంది అమ్మాయిలు, 46.66% మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమింగ్‌కు 2,03,167 అప్లికేషన్లు వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 10 వరకు రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు EAPCET <
News April 5, 2026
తొర్రూర్: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన MHBD జిల్లా తొర్రూరు(M) హరిపిరాలలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పులిగుజుల అనూష (22)ను ఆమె భర్త సాయి తరచూ అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష, శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుంది. అనూష తండ్రి ఫిర్యాదు మేరకు సాయిపై ఎస్సై ఉపేందర్ కేసు నమోదు చేశారు.
News April 5, 2026
శ్రీ సత్యసాయి: నకిలీ ఏసీబీ అధికారి అరెస్ట్

ACB అధికారినంటూ బెదిరించి డబ్బు వసూలు చేసిన కేసులో కూడేరు(M) కలగల్లుకు చెందిన హనుమంతును అరెస్ట్ చేసినట్లు CI శివరాముడు తెలిపారు. 2021లో తహశీల్దార్ అన్వర్ హుస్సేన్‌కు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తాను ACB సీఐ అని, ముదిగుబ్బ తహశీల్దార్ ఆఫీసులో రైడ్ జరగకూడదంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించి రూ.50 వేలు వసూలు చేశాడు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసి, హనుమంతుగా గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు.


