News December 2, 2025

అనకాపల్లి: ‘టెన్త్‌ విద్యార్థుల శత శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి’

image

జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఉపాధ్యాయులు అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. అనకాపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాలలో హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ నెల 5న మెగా పీటీఎం సమావేశం పండుగ వాతావరణంలో జరగాలన్నారు. డీఈఓ అప్పారావు, ఆఐఓ వినోద్ బాబు పాల్గొన్నారు.

Similar News

News March 29, 2026

ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీలేదు: కలెక్టర్

image

ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీ లేదని,నగర ప్రజలు ఈనెల 31వ తేదీ లోపు పన్నులు చెల్లించి జరిమానా భారాన్ని నివారించుకోవాలని కలెక్టర్, జీసీడబ్ల్యూపీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఆదివారం వరంగల్‌లో 14,37,38 డివిజన్లలో, హనుమకొండలోని 5వ డివిజన్లోని సురేంద్రపురి, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో పన్నుల సేకరణను పరిశీలించారు. ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

News March 29, 2026

ADB: రేపటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఈ నెల 30, 31తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డైరెక్టర్ రమేష్ తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. సందేహాల కోసం 9494149416ను సంప్రదించాలన్నారు.

News March 29, 2026

కావలిలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ దుర్మరణం

image

కావలి రూరల్ వెంకయ్యగారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అంకయ్య కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి కేసు నమోదు చేశారు.