News November 20, 2025
అనకాపల్లి: డీఈవోలు, ఎంఈవోలు ఫిర్యాదుల స్వీకరణకు ఆదేవాలు

విద్యా సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కరణకు రాష్ట్రంలోని DEOలు, MEOలు ప్రతిరోజూ నిర్నీత సమయం కేటాయించాలని AP స్టేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు ఈనెల 19న ఉత్తర్వులు జారీచేశారని అనకాపల్లి DEO అప్పారావు గురువారం తెలిపారు. DEOలు రోజూ సా.5గం.ల నుంచి 6గం.ల వరకూ, MEOలు సా.4గం.ల నుంచి 5గంంటల వరకు వారి కార్యాలయాల్లో ప్రజలు, పేరెంట్స్, టీచర్స్‌కు అందుబాటులో వుండాలని ఆదేశాలున్నాయన్నారు.
Similar News
News November 20, 2025
‘జిల్లాలో 5వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు’

బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ఉద్యాన, వ్యవసాయ శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమం జరిగింది. మొక్కలు 3వ సంవత్సరం నుంచి 30 ఏళ్లు దిగుబడి ఇస్తాయని, 90% సబ్సిడీపై మొక్కలు, డ్రిప్‌కు 80%- 100% సబ్సిడీ అందిస్తున్నట్లు ఉద్యాన అధికారి అర్చన తెలిపారు. జిల్లాలో 5,000 ఎకరాల్లో తోటలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం అధికారులు తోటలను సందర్శించి రైతులకు సూచనలు చేశారు.
News November 20, 2025
HYD: ఓయూ, SCCL మధ్య ఒప్పందం!

ఉస్మానియా విశ్వ విద్యాలయం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) మధ్య కీలక ఒప్పందం కుదురుచుకుంది. ఎస్సీసీఎల్ సీఎస్ఆర్ కింద ఆర్థిక సంవత్సరం 2025-2026 కోసం స్కాలర్‌షిప్ కార్యక్రమం ఆమోదించబడింది. ఈ ఒప్పంద పత్రాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య నరేష్ రెడ్డి సంతకం చేశారు. పరిశోధనా రంగానికి మద్దతుగా ఈ కార్యక్రమానికి రూ.కోటి మంజూరు చేశారు.
News November 20, 2025
HNK: ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో వారం రోజులుగా నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలు నేటితో ముగిసాయి. ముగింపు వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, నేటి సమాజంలో మానవుడికి టెక్నాలజీ ఎంత ముఖ్యమో, గ్రంథాలయాలు కూడా అంతే ముఖ్యమన్నారు. హనుమకొండ జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.


