News February 13, 2025
అనకాపల్లి: తీర్థానికి వస్తుండగా యువకుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739457907591_697-normal-WIFI.webp)
కె.కోటపాడు-మేడిచర్ల రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద బైకు అదుపుతప్పి చోడవరం(M) గవరవరం గ్రామానికి చెందిన అప్పికొండ కిరణ్ (21) మృతి చెందాడు. విశాఖలో ఉంటున్న కిరణ్ స్వగ్రామమైన గవరవరంలో గ్రామదేవత తీర్థానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తండ్రి బాబురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే.కోటపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 14, 2025
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది గైర్హాజర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739464095706_51926657-normal-WIFI.webp)
జనగామ జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్‌లో 644 మంది విద్యార్థులకు గాను 577 మంది హాజరయ్యారని, రెండో సెషన్‌లో జరిగిన పరీక్షకు 492 మంది విద్యార్థులకు 469 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
News February 14, 2025
IPLలో తొలి మ్యాచ్ ఎప్పుడు, ఎవరి మధ్య..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739465718378_1045-normal-WIFI.webp)
ఈ ఏడాది IPL షెడ్యూల్‌కు సంబంధించిన కీలక వివరాలను క్రిక్‌బజ్ వెబ్‌సైట్ వెల్లడించింది. ‘బీసీసీఐ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 22న(శనివారం) కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగనుంది. గత ఏడాది రన్నరప్ టీమ్ సన్‌రైజర్స్ తర్వాతి రోజు మధ్యాహ్నం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్ మీద తలపడనుంది. ఇక మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది’ అని పేర్కొంది.
News February 14, 2025
ఎల్లుండి OTTలోకి కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739460834881_695-normal-WIFI.webp)
కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ మూవీ ‘మ్యాక్స్’ ఈ నెల 15న ఓటీటీలోకి రానుంది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించి సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. అదే రోజు రాత్రి 7.30కు జీ కన్నడ ఛానల్‌లో ప్రసారం చేస్తామని పేర్కొంది. DEC 25న విడుదలై ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది.