News March 18, 2025
అనకాపల్లి: తొలి రోజు 195 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షకు 195 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 107 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 21,162 మంది విద్యార్థులకు 20,967 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. ఏడు స్క్వాడ్ బృందాలు 44 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయని అన్నారు.
Similar News
News December 12, 2025
ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది !

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఓటర్లను ప్రభావితం చేయడం మిగిలింది. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు.
News December 12, 2025
వరంగల్: ఎనిమిది మందికి ఎస్సైలుగా పదోన్నతి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మందికి ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో యాదగిరి, సుదర్శన్, కృష్ణమూర్తి, అజీద్దున్, రవీంద్రచారి, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరి ఉన్నారు.
News December 12, 2025
ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్యలను నివారించాలి: ఎంపీ మహేష్

గత నెల నవంబర్ 6న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆటోమేషన్ సిస్టంలో సమస్య ఏర్పడిన విషయాన్ని ఏలూరు ఎంపీ మహేష్ పార్లమెంటులో శుక్రవారం ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఉన్న IP- ఆధారిత ఆటోమేటిక్ మెసేజ్ సెర్చింగ్ సిస్టం స్థానంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టంను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు.


