News February 5, 2025
అనకాపల్లి: ‘దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు’

అనకాపల్లి జిల్లాలో గీత కులాల వారికి కేటాయించిన 15 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించినట్లు అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి.సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరు సాధారణ లైసెన్స్ ఫీజులో సగం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. గీత కులాల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 13, 2026
‘ఒక్క ఓటు’తో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం!

TG: కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 259, BRS అభ్యర్థి తాహెర్‌కు 258 ఓట్లు పోలయ్యాయి. మొదటిసారి ఓట్ల లెక్కింపులో 2 ఓట్లు మెజార్టీ రావడంతో రీకౌంటింగ్ చేయగా ఒక్క ఓటుతో కాంగ్రెస్ గెలిచింది. పరకాల మున్సిపాలిటీలోని 17వ వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.
News February 13, 2026
పోలవరం: నేడే ఇంటర్ హల్ టికెట్స్ విడుదల

ఇంటర్ విద్యార్థుల హల్ టికెట్స్ శుక్రవారం విడుదలవుతాయని పోలవరం జిల్లా ఇంటర్ పరీక్షల పరిశీలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రిన్సిపల్ లాగిన్ నుంచి జిల్లా పేరుతో హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో 10 కేంద్రాల్లో ఈ నెల 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభమౌతాయన్నారు. జిల్లాలో 32 కళాశాలలకు చెందిన ప్రథమ 2,619, ద్వితీయ సంవత్సరం 2,336 మంది పరీక్షలు రాయనున్నారన్నారు.
News February 13, 2026
రోజుకు ₹200 మీల్స్‌పై పన్ను మినహాయింపు!

ఉద్యోగులకు మీల్స్‌పై ఇస్తున్న పన్ను మినహాయింపును పెంచాలని ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ 2026లో ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో ఇది రోజుకు ₹50గా ఉండగా.. దాన్ని ₹200కు పెంచాలని నిర్ణయించారు. ఇది ఫైనలైజ్ అయితే ఉద్యోగులకు ఏటా మీల్స్ ఖర్చుల కింద ₹1,05,600పై పన్ను మినహాయింపు పొందే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రయోజనం పాత పన్ను విధానంలో ITR సమర్పించేవారికి వర్తిస్తుంది. కొత్త విధానంపై క్లారిటీ రావాల్సి ఉంది.


