News August 26, 2025

అనకాపల్లి: దరఖాస్తు చేసుకునే గడువు పెంపు

image

జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి లో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు దరఖాస్తు గడువును ఈనెల 29వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి.సుధీర్‌ తెలిపారు. ఆసక్తి గలవారు రూ.5 లక్షల నాన్ రెఫండబుల్ దరఖాస్తు రుసుము, రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలన్నారు. 30న కలెక్టరేట్లో డ్రా ద్వారా బార్లు కేటాయించడం జరుగుతుందన్నారు.

Similar News

News August 27, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పేర్ని నానిపై ఏలూరు పోలీసుల కేసు నమోదు
☞ మచిలీపట్నం: సులభతర వాణిజ్యంపై కలెక్టర్ వర్క్ షాప్
☞ కృష్ణా జిల్లాలో వేగవంతంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
☞ మచిలీపట్నం- నరసాపురం జాతీయ రహదారిపై ప్రమాదం
☞ అవనిగడ్డ: పడవలో మృతదేహం
☞ మచిలీపట్నంలో జనసేన నేత సస్పెండ్

News August 27, 2025

క్యాబినెట్ భేటీ 30కి వాయిదా

image

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈనెల 29న క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దాన్ని ఈనెల 30కి రీషెడ్యూల్ చేసింది. ఆ రోజు మ.ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

News August 27, 2025

VKB: విత్తన గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

image

విత్తన గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుందామని మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. వికారాబాద్‌లోని ఎన్ఎస్‌పీ కార్యాలయంలో ఆయన విత్తన గణపతి విగ్రహాలను మంగళవారం పంపిణీ చేశారు. గణపతి భక్తితో పాటుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విత్తన గణపతిని నీటిలో నిమజ్జనం చేయడంతో అది మొక్కగా పెరిగి సమాజానికి నీడను ఇస్తుంద తెలిపారు.