News March 18, 2026
అనకాపల్లి: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ పథకం కింద నేటి నుంచి కనీసం 40 శాతం అంగవైకల్యం కలిగిన వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News April 5, 2026
భీమవరం కలెక్టరేట్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, కుల రహిత సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News April 5, 2026
ఏలూరులో జగ్జీవన్ రామ్ జయంతి

ఏలూరు జిల్లా కేంద్రంలోని గౌతమి సమావేశ మందిరంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ మాజీ ఉప ప్రధానిగా, సంఘ సంస్కర్తగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News April 5, 2026
తిరుపతి: దరఖాస్తుల గడువు పొడిగింపు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2026 సంవత్సరానికి Ph.D/ M.S(Research) ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/admissions వెబ్ సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 13.


