News March 17, 2025

అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

image

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు, యలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Similar News

News November 10, 2025

గిరాకీ లేని టెస్లా.. అక్టోబర్‌లో అమ్మింది 40 కార్లే

image

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ కార్లకు ఇండియాలో పెద్దగా గిరాకీ కనిపించడం లేదు. దేశంలో జులైలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 104 కార్లే విక్రయించింది. అక్టోబర్‌లో 40 కార్లు మాత్రమే అమ్మగలిగింది. ఒకే మోడల్, రెండే స్టోర్లు, దిగుమతి చేస్తుండటం, అధిక ధరలే కారణమని తెలుస్తోంది. మరో విదేశీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఇక్కడే తయారు చేసి, తక్కువ ధరలకే ఎక్కువ కార్లను విక్రయిస్తోంది.

News November 10, 2025

సిద్దిపేట: ప్రజాకవి అందెశ్రీ అందుకున్న పురస్కారాలు

image

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన <<18246561>>అందెశ్రీ<<>> KU నుంచి డాక్టరేట్‌ పొందారు. అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌ నాయక్ పురస్కారం అందుకున్నారు.

News November 10, 2025

కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

image

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.