News March 20, 2025
అనకాపల్లి: దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.
Similar News
News March 20, 2025
‘ఆర్యవైశ్యులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’

ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవలని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. గురువారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేందుకు 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకోవాలని కోరారు.
News March 20, 2025
హన్మపూర్ హత్య కేసులో ఇద్దరికి రిమాండ్

పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్‌లో వెంకటేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. వెంకటేష్ నిత్యం తాగి వచ్చి తల్లి లక్ష్మమ్మ, భార్య సబితను వేధించేవాడు. వేధింపులకు తాళలేక ఈనెల 19న తల్లి, భార్య ఇద్దరు కలిసి ఐరన్ రాడ్‌తో అతడి చెవి భాగాన కొట్టి చంపారు. నేరం ఒప్పుకోవడంతో వారిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
News March 20, 2025
రూ.50 కోట్లు పెట్టి కుక్కను కొన్నాడు!

బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ‘కాడాబాంబ్ ఒకామి’ అనే అరుదైన ‘వోల్ఫ్‌డాగ్’ను $5.7 మిలియన్ల(సుమారు రూ.50 కోట్లు)కు కొనుగోలు చేశారు. ‘నాకు కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే దీనిని కొనుగోలు చేసేందుకు అంత ఖర్చు చేశా. అరుదైన, ప్రత్యేకమైన కుక్కలను ఇండియాకు పరిచయం చేయడం నాకిష్టం’ అని ఆయన వెల్లడించారు. ఈ డాగ్ యూఎస్‌లో జన్మించింది. దాని వయసు 8 నెలలు కాగా రోజు 3 కేజీల పచ్చి మాంసం తింటుంది.