News November 20, 2025

అనకాపల్లి: ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

image

జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయిన నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జేసీ జాహ్నవి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు ఈ-బ్యాంక్ గ్యారంటీలని పౌర సరఫరాల శాఖకు సమర్పించాలన్నారు. ధాన్యం సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

Similar News

News November 22, 2025

ఈ-రేస్ కేసులో ఏసీబీ రిపోర్ట్.. నిందితులు వీరే

image

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్టు బయటికొచ్చింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి, A4గా కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఈ-రేస్ కంపెనీ FEO పేర్లను పొందుపరిచింది. 2024 డిసెంబర్ 19న కేసు నమోదవగా ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపింది. కాగా ఈ కేసులో ఛార్జ్‌షీట్ నమోదుకు, కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.

News November 22, 2025

‘ఫ్రీ స్కూటీ స్కీమ్’.. PIBFactCheck క్లారిటీ

image

‘ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్’ పేరుతో SMలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్‌ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.

News November 22, 2025

ఏలూరు జిల్లాలో యాక్సిడెంట్.. ఒక్కరు మృతి

image

ఏలూరు జాతీయ రహదారిలోని దుగ్గిరాల సమీపంలో శనివారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ప్రమాదంలో ఘటన స్థలంలోనే బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న హైవే సేఫ్టీ సిబ్బంది మృతదేహాన్ని ఏలూరు సర్వజన హాస్పిటల్‌కి తరలించారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.