News February 16, 2026

అనకాపల్లి: నిరంతరాయంగా 10th ప్రీ ఫైనల్ పరీక్షలు

image

పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిరంతరాయంగా జరుగుతున్నాయని DEO అప్పారావు నాయుడు తెలిపారు. ఈ నెల 9న తెలుగుతో మొదలైన ఈ పరీక్షలు సోషల్ స్టడీస్‌తో 17న ముగుస్తాతాయని సోమవారం తెలిపారు. శివరాత్రి జాగరాలు నేపథ్యంలో సోమవారం దాదాపుగా అన్ని పాఠశాలలూ లోకల్ హాలిడేని ప్రకటించాయి. అయినప్పటికీ సోమవారం షెడ్యూల్ ప్రకారం బయాలజీ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News February 20, 2026

రాష్ట్రంలో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని RTGS అంచనా వేసింది. సెంట్రల్ ఆంధ్ర, ఉత్తర కోస్తా, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

News February 20, 2026

పెద్దపల్లి: విద్యార్థులను అభినందించిన కలెక్టర్

image

హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా విద్యార్థులను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌లో అభినందించారు. జిల్లాకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొనగా బడుగు సందీప్ జిగ్‌జాగ్ వాకింగ్‌లో, ఎడునూరి పౌర్ణమి చెస్‌లో, కటకం శ్రీరామ్ చరణ్ పరుగుపందెం, మ్యూజికల్ చైర్ తదితర విభాగాల్లో విజేతలయ్యారు. డీఈవో శారద, ఐఈ కోఆర్డినేటర్ కవిత పాల్గొన్నారు.

News February 20, 2026

విశాఖలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

విశాఖలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 85 కేంద్రాల్లో 81,001 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు తాగునీరు, వైద్య శిబిరాలు, అదనపు బస్సుల సౌకర్యం కల్పించాలని ఆమె సూచించారు. పొరపాట్లు జరగకుండా పరీక్షలను విజయవంతం చేయాలని జేసీ స్పష్టం చేశారు.