News March 21, 2024
అనకాపల్లి: నీళ్ల తొట్టిలో పడి బాలుడు మృతి

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు పంచాయితీలోని కోడాపల్లిలో ఘోరం జరిగింది. గ్రామానికి చెరుకు చంద్రరావు, జానకి దంపతుల ఏడాదిన్నర కుమారుడు గణేష్ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి మృతి చెందాడు. తొట్టిలో పడిన బాలుడిని దేవరాపల్లి పీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News January 22, 2026
ఈ నెల 29న విడుదల కానున్న ఏపీ మత్స్యకారులు

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.
News January 22, 2026
ఏయూలో పాలన గాడి తప్పిందా?

ఖరగ్‌పూర్ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను ఏయూకి వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే వీసీ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను కలుపుకొని ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఈడీ విద్యార్థి మృతి, వీసీని నేరుగా కలవొద్దంటూ సర్క్యులర్లు, తాజాగా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు మెస్‌లో భోజనం నిలిపివేయడంతో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.
News January 22, 2026
విశాఖ: జీవీఎంసీ సమావేశంలో కుప్పకూలిన ఇంజినీర్ మృతి

గాజువాక జీవీఎంసీ హాల్లో సమీక్ష జరుగుతుండగా కుప్పకూలిపోయిన సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం అధికారులు, ప్రజాప్రతినిధులు, జోనల్ కమిషనర్ సమక్షంలో సమావేశం జరుగుతుండగా గోవిందరాజు లేచి మాట్లాడే ప్రయత్నంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు మృతి చెందారు.


