News January 31, 2025

అనకాపల్లి: పండగరోజు ఆ గ్రామంలో విషాదం 

image

మాకవరపాలెం(M) లచ్చన్నపాలెంలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన రొంగల సతీశ్(25) మృతి చెందాడు. RTCలో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సతీశ్ వేరే చోటకు బైక్‌పై వెళుతుండగా..ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను తప్పించబోయి కరెంట్ పోల్‌ను ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దామోదరనాయుడు తెలిపారు. కాగా.. గ్రామంలో ఈరోజు గైరమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి.

Similar News

News February 25, 2026

తిరిగి జట్టులో చేరనున్న రింకూ సింగ్!

image

T20 WC: తండ్రికి అనారోగ్యం నేపథ్యంలో చెన్నై క్యాంప్ నుంచి రింకూ సింగ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు జింబాబ్వేతో మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ అతడు తిరిగి భారత జట్టులో చేరతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. అయితే రింకూ తుది జట్టులో ఉంటారా, లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. WCలో ఇప్పటిదాకా అతడు ఆడిన 5 మ్యాచుల్లో 24 రన్స్ మాత్రమే చేయడం గమనార్హం.

News February 25, 2026

ఏకీకృత కుటుంబ సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

image

యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

News February 25, 2026

విశాఖలో పర్యటించనున్న ఒడిశా గవర్నర్

image

ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐఐఏఎమ్‌లో పుస్తకావిష్కరణ, ‘ప్రైడ్ ఆఫ్ నేషన్’ అవార్డుల ప్రదానం, బాలాజీ హైఫీల్డ్స్ స్కూల్ వార్షికోత్సవం, అమలాపురంలో జరిగే ‘వరల్డ్ తెలుగు కాన్‌క్లేవ్’ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మార్చి 5న తిరిగి భువనేశ్వర్ వెళ్తారు.