News October 25, 2024
అనకాపల్లి: ‘పగలు రాత్రి గస్తీ నిర్వహించాలి’

దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి గస్తీ నిర్వహించాలని పోలీస్ అధికారులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పరవాడలో జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో నిందితులు వాడినట్లు అనుమానిస్తున్న వాహనం లాంటిదే కేరళ రాష్ట్రం త్రిశూల్‌లో ఇదే రకమైన కేసులో పట్టుబడిందని అన్నారు. పీటీ వారెంట్ పై నిందితులను తీసుకొస్తామన్నారు.
Similar News
News December 30, 2025
న్యూ ఇయర్ వేళ విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..

విశాఖలో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, ఆర్కే బీచ్ రోడ్డు, BRTS రోడ్లపై వాహనాలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం తాగి నడిపినా వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బీచ్ సందర్శకులకు ఏయూ గ్రౌండ్స్, APIIC గ్రౌండ్, గోకుల్ పార్కుల్లో పార్కింగ్ కేటాయించామని ADCP ప్రవీణ్ కుమార్ తెలిపారు.
News December 30, 2025
వైకుంఠ ఏకాదశి రద్దీ: సింహాచలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు కొండపైకి ద్విచక్ర వాహనాలను నిలిపివేసి, కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ విభాగం కోరింది.
News December 30, 2025
విశాఖ: వడ్డీ లేకుండా పన్నుల చెల్లింపు.. రేపటితో గడువు పూర్తి

2025-26 ఆర్దిక సంవత్సరంనకు(1.10.25 – 31.03.26) వరకు జీవీఎంసీకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను వడ్డీ లేకుండా డిసెంబర్ 31లోగా చెల్లించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. గడువులోగా చెల్లించి వడ్డీ చెల్లింపు మినహాయింపు పొందాలన్నారు. ప్రజల సౌకర్యార్ధం జీవీఎంసీ వెబ్ పోర్టల్ (gvmc.gov.in)లో పన్నులు చెల్లించవచ్చని చెప్పారు.


