News March 22, 2025
అనకాపల్లి: పదో తరగతి పరీక్షకు శతశాతం హాజరు

అనకాపల్లి జిల్లాలో శనివారం నిర్వహించిన పదో తరగతి సంస్కృత పరీక్షకు శత శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 951 మంది పరీక్షకు హాజరైనట్లు వివరించారు. పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
బండి సంజయ్ చొరవతో మూడు ప్రాజెక్టులకు ఆమోదం

KNR పార్లమెంటు పరిధిలో కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో మూడు ప్రాజెక్టులకు ఆమోదం లభించాయి. గన్నేరువరం మండలంలో మానేరు నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.77కోట్లు, వేములవాడ-సిరికొండ రోడ్డు నిర్మాణానికి రూ.23కోట్లు, ఆర్నకొండ–మల్యాల డబుల్ రోడ్డు విస్తరణ పనులకు రూ.50 కోట్ల మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆమోదం తెలిపిన PM నరేంద్రమోదీ, కేంద్రమంత్రి గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
News September 17, 2025
HYD: SEP 17.. ఇదే కదా నిజమైన సాతంత్ర్యం!

1947, AUG 15.. దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే HYD ప్రజలు నిజాం, దొరలు, రజాకార్ల నిర్బంధంలో ఉన్నారు. అప్పటికే(1946) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పురుడుపోసుకుంది. భారత స్వాతంత్ర్య స్ఫూర్తి HYD సంస్థానాన్ని ఆహ్వానించిందేమో మరి.. ఏళ్లుగా ఏడ్చిన కళ్లు ఎర్రబడ్డాయి. నీ బాంచన్ దొర అన్న జనం బ్యాంచత్ అని రాయి, రప్ప, సుత్తె, కత్తి చేతబట్టి పోరాడారు. చివరకు 1948 SEP 17న ‘ఆపరేషన్ పోలో’తో స్వేచ్ఛను పొందారు.
News September 17, 2025
ఖమ్మం: మారణకాండ.. ఒకే చితిపై ఏడుగురి సజీవ దహనం

బోనకల్(M) గోవిందాపురం(L)లో రజాకారులు, భూస్వాములు రైతాంగ సాయుధ పోరాట యోధులపై మారణకాండ సృష్టించారు. ఆళ్లపాడు, వల్లాపురం, CKN(M) రేపల్లెవాడకు చెందిన యలమందల రామచంద్రయ్య, మంద అచ్చయ్య, గొర్రె ముచ్చు అజరయ్య, మద్ది రాములు, మడుపల్లి వీరస్వామి, సామినేని గోపయ్య, తమ్మినేని బుచ్చయ్యలను చిత్రహింసల అనంతరం ఒకే చితిపై సజీవ దహనం చేశారు. వారిని స్మరించుకుంటూ ఏటా ఫిబ్రవరి 10న స్థూపం వద్ద సంస్మరణ సభలు జరుగుతున్నాయి.