News November 10, 2025
అనకాపల్లి పీజీఆర్ఎస్‌లో 239 అర్జీలు

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. అలాగే అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమస్యలు పరిష్కారం అవ్వకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. సమస్యలపై 239 అర్జీలను ప్రజలు సమర్పించారు.
Similar News
News November 10, 2025
KNR: ఫుడ్ పాయిజన్ ఘటనపై బండి సంజయ్ ఆరా

జమ్మికుంట ప్రాథమిక పాఠశాలలో జరిగిన <<18250681>>ఫుడ్ పాయిజన్ ఘటన<<>>పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఆయన ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని కలెక్టర్ మంత్రికి వివరించారు. మెరుగైన చికిత్స కోసం KNR ఆసుపత్రికి తరలించాలన్నారు.
News November 10, 2025
అత్యంత స్వచ్ఛమైన గాలి లభించే నగరాలివే!

ప్రస్తుతం చాలా నగరాలను గాలి కాలుష్యం వెంటాడుతోంది. AQI లెవెల్స్ భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఏకంగా 500+AQI నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో స్వచ్ఛమైన గాలి లభించే టాప్-5 నగరాలేవో తెలుసుకుందాం. 1. షిల్లాంగ్(మేఘాలయ)-12, 2.అహ్మద్‌నగర్(MH)-25, 3.మధురై(TN)-27, 4. మీరా భయందర్(MH)-29, 5. నాసిక్(MH)- 30 ఉన్నాయి. కాగా హైదరాబాద్‌లో 140+ AQI నమోదవుతోంది.
News November 10, 2025
రేపే పోలింగ్.. స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

TG: రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో కలెక్టర్ హరిచందన ఇప్పటికే సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఐటీ ఆఫీసులకు ఈ హాలిడే వర్తిస్తుంది. అటు ఈ నెల 14న కౌంటింగ్ జరిగే చోట సెలవు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.


