News January 12, 2026

అనకాపల్లి: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌కు 317 అర్జీలు

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు మొత్తం 317 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారం‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

Similar News

News February 16, 2026

NGKL: నల్లమలలో సేవాలాల్ పుణ్యక్షేత్రం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

image

నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అద్భుత క్షేత్రాన్ని నిర్మించి, వచ్చే ఏడాది జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహిస్తామన్నారు. ఈ నిర్ణయంపై జిల్లా గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

News February 16, 2026

నేడు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన

image

AP: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నేడు అమరావతికి రానున్నారు. సచివాలయంలో CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‌తో ఆయన భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చలు జరపనున్నారని సమాచారం. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్, సంజీవని ప్రాజెక్ట్, టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ విధానాలను ఆయన పరిశీలించనున్నారు.

News February 16, 2026

ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలంటే?

image

నిన్నటి శివరాత్రి ఉపవాసాన్ని ఈరోజు సూర్యోదయం తర్వాత విరమించాలి. దీనినే ‘పారణ’ అంటారు. చతుర్దశి తిథి ముగిసేలోపు ఉపవాసం విరమించాలి. అందుకు 6.42AM – 3.10PM అనువైన సమయమని పండితులు చెబుతున్నారు. ‘స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శివదర్శనం చేసాక ఆహారం తీసుకోవాలి. రాత్రంతా జాగరణ చేసిన వారు పారణ తర్వాత నిద్రపోవాలి. క్రమశిక్షణతో ఉపవాసం వదిలితే శివానుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్య ఫలం లభిస్తుంది’ అంటున్నారు.