News October 28, 2025

అనకాపల్లి: పెట్టుబడి పేరుతో రూ.13.62 లక్షలు కొట్టేసింది

image

ఓ సంస్థలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో రెట్టింపు ఆదాయం వస్తుందని అనకాపల్లికి చెందిన ఎలక్ట్రీషియన్ రమణబాబును మోసం చేసి రూ.13.62 లక్షలు కాజేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 17న రమణబాబుకు ఓ మహిళ ఫోన్ చేసి తాను సూచించిన సంస్థలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు.రమణబాబు ఆమె ఖాతాకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత మోసపోయినట్లు గ్రహించాడు.

Similar News

News October 28, 2025

కల్లుపై నిషేధం ఎత్తేస్తాం: తేజస్వీ యాదవ్

image

బిహార్‌ను దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని RJD నేత తేజస్వీ యాదవ్ అన్నారు. తమ మ్యానిఫెస్టో దీనికి రోడ్ మ్యాప్‌ అని చెప్పారు. ‘మేం గెలిస్తే కల్లుపై నిషేధం ఎత్తేస్తాం. అవినీతి అధికారులు, బీజేపీ నేతలు CM నితీశ్‌ను పప్పెట్‌గా చేశారు. NDA ఆయనను మళ్లీ సీఎం చేయదు’ అని పేర్కొన్నారు. కాగా తాము ఎక్కువ సీట్లు గెలుస్తామని అభిషేక్ బెనర్జీ (TMC) అన్నారు. OPS అమలు చేస్తామని దీపాంకర్ భట్టాచార్య(CPI) తెలిపారు.

News October 28, 2025

ములుగు: మావోయిస్టు సీసీ కమిటీ కార్యదర్శిగా దేవ్ జీ

image

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి@దేవ్ జీ ఎన్నికైనట్లు నేడు డీజీపీ ఎదుట లొంగిపోయిన సీసీ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు@చంద్రన్న తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా సీసీ కమిటీ కార్యదర్శి ఎవరనే విషయానికి తెరపడింది. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నేడు చంద్రన్నతో పాటు బండి ప్రకాశ్ లొంగిపోయిన విషయం తెలిసిందే.

News October 28, 2025

MBNR: టీఆర్పి పార్టీ మేధావుల నిపుణుల కమిటీ ఛైర్మన్ నియామకం

image

MBNR జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ డీఈవో, డాక్టర్ శివార్చక విజయ్ కుమార్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వీరిని రాష్ట్ర మేధావులు, నిపుణుల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అంకితభావం నిబద్దతతో కలుపుకొని క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.