News March 8, 2025

అనకాపల్లి: పేదరికం లేని సమాజమే లక్ష్యం: కలెక్టర్

image

పేదరికం లేని సమాజమే లక్ష్యంగా శనివారం నుంచి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీ4 సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీ వరకు సర్వే జరుగుతుందని తెలిపారు. ఇంటింటా సర్వే ద్వారా పేదల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. 

Similar News

News December 26, 2025

చిరిగిన నోట్లు ఇలా మార్చుకోండి!

image

మీ దగ్గర చిరిగిన నోట్లు ఉన్నాయా? కంగారుపడొద్దు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం రూ.10 కంటే ఎక్కువ విలువైన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. నోటు మురికిగా మారినా, కొద్దిగా చిరిగినా కొత్తవి ఇస్తారు. గాంధీ ఫొటో, ఆర్బీఐ గవర్నర్ సంతకం, వాటర్ మార్క్ మిస్ అయితే నోటులో కొంత విలువను చెల్లిస్తారు. ఎలాంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదు. పూర్తిగా కాలిపోయినా, దెబ్బతిన్నా RBI ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవచ్చు.

News December 25, 2025

ఎన్టీఆర్: హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనుల ప్రారంభం

image

రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ గురువారం సాయంత్రం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన పూజలు నిర్వహించారు. 2027కల్లా హైకోర్టు నిర్మాణం పూర్తవుతుందని, B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. 45 వేల టన్నుల స్టీల్ వినియోగిస్తూ, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమరావతిలో హైకోర్టు కడుతున్నామన్నారు.

News December 25, 2025

కమ్మర్‌పల్లి: కారు ఢీ.. ఒకరి మృతి

image

కమ్మర్‌పల్లి మండలం రాజరాజేశ్వరి నగర్‌లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాల గంగాధర్(70) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది గంగాధర్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.