News April 7, 2025

అనకాపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 42 ఫిర్యాదులు

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 42 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఆస్తి తగదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఎస్పీ తుహీన్ సిన్హా స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.

Similar News

News April 7, 2025

ఆదాయం లేకుండా GDP ఎలా పెరిగింది బాబూ: బొత్స

image

AP: అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని సీఎం చంద్రబాబును వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అసలు ఆదాయమే లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుందని నిలదీశారు. ‘కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం తగ్గింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే ధైర్యం ఆయనకు లేదు. చెత్త పన్ను తీయడం కాదు. వీధుల్లో ఉన్న చెత్త తీయించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News April 7, 2025

జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

@గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా 37 ఫిర్యాదులు వెల్లువ @అయిజ మండలం యాపదిన్నె గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పశు బల ప్రదర్శన బండ్ల గిరక పోటీలు @కేటిదొడ్డి మండలంలో సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సరిత @ గద్వాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిది అందజేత @రేషన్ దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని బీజేపీ డిమాండ్.

News April 7, 2025

HNK: 9 నుంచి ప్రాక్టికల్ తరగతులు

image

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు డిగ్రీ బీఎస్సీ, ఎంఎస్సీ, సీఎస్ కోర్సుల మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రాక్టికల్ తరగతులు జరుగుతాయని దూరవిద్య సంచాలకులు ఆచార్య సురేష్ లాల్, సహాయ సంచాలకులు వెంకట్ గోపీనాథ్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!