News April 21, 2025
అనకాపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 320 అర్జీలు: జేసీ

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు 320 అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ.. సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించారు.
Similar News
News December 15, 2025
పేరుపాలెంబీచ్‌లో న్యూఇయర్ వేడుకలు అభినందనీయం: డిప్యూటీ స్పీకర్

పేరుపాలెం బీచ్‌లో ఈనెల 31న సాగర తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వినోదాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.
News December 15, 2025
154 సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ 7 మండలాల్లో 138 సర్పంచ్, 1123 వార్డు మెంబర్లు ఈ ఎన్నికల్లో గెలిచారు. రెండవ విడతలో 16 మంది సర్పంచ్, 248 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు. అలాగే 154 పంచాయతీలకు ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తయింది. 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
News December 15, 2025
హిమాలయాల్లో అణు పరికరం.. పొంచి ఉన్న ప్రమాదం!

1965లో చైనా అణు కార్యక్రమంపై నిఘా కోసం అమెరికా CIA భారత్‌తో కలిసి హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరం ఏర్పాటుచేయాలని భావించింది. మంచు తుఫానుతో ప్లుటోనియం ఉన్న పరికరాన్ని అక్కడే వదిలేశారు. తర్వాత వెళ్లి వెతికినా అది కనిపించలేదు. హిమానీనదాలు కరిగి ఆ పరికరం దెబ్బతింటే నదులు కలుషితం అవ్వొచ్చని సైంటిస్టులు తెలిపారు. తాజాగా బీజేపీ MP నిశికాంత్ ట్వీట్‌తో ఈ వార్త వైరలవుతోంది.


