News February 20, 2025

అనకాపల్లి: ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

image

అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జాతీయ రహదారి భద్రత సమన్వయ కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. స్పీడ్ బ్రేకర్ల దగ్గర కలర్ పెయింటింగ్ వేయాలన్నారు. హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలన్నారు.

Similar News

News November 6, 2025

మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

image

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.

News November 6, 2025

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ జానకి రామయ్య మృతి

image

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య (93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారు రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించిన మండవ, పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News November 6, 2025

ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.