News February 14, 2026
అనకాపల్లి: ప్రేమ.. త్యాగానికి ప్రతీకగా కళారూపాలు

నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి సందర్భానుసారం తన కళానైపుణ్యతతో కళారూపాలను తయారు చేస్తున్నాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అడుగు చెక్కపై ప్రేమికుల దృశ్యం చెక్కాడు. ఇందుకోసం తనకు గంట సమయం పట్టిందన్నాడు. మరో చెక్కపై బ్లాక్ డే సందర్భంగా అమరులైన వీరులకు ఆర్మీజవాను నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని అద్భుతంగా చెక్కాడు.
Similar News
News February 21, 2026
అన్నమయ్య: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అన్నమయ్య జిల్లాలో ఈనెల 23 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఐవో రవి వెల్లడించారు. మదనపల్లెలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 50 కేంద్రాల్లో 28,550 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 14,607 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 13,943 మంది ఉన్నారన్నారు. 700మంది ఇన్విజిలేటర్లు, 5 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తాయన్నారు.
News February 21, 2026
కోదాడ: గడ్డి మిషన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజు (23) ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై గోపాల్ రెడ్డి వివరాల ప్రకారం.. గడ్డి మిషన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై ఈనెల 9న నాగరాజు విషం తాగాడు. మొదట ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News February 21, 2026
ఇంటర్వ్యూతో ANGRAUలో ఉద్యోగాలు

ఏపీలోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(ఫామ్ మెషినరీ, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్), BTech, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇవాళ ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. టీచింగ్ అసోసియేట్‌కు నెలకు రూ.61,000+HRA, పార్ట్ టైమ్ టీచర్‌కు రూ.27,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://angrau.ac.in/


