News January 7, 2026

అనకాపల్లి: బీఎల్వోలకు నోటీసుల జారీ

image

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించిన బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ వెల్లడించారు. ఎలమంచిలిలోని పోలింగ్ కేంద్రం-46, అచ్యుతాపురం మండలం ఆవ సోమవారంలోని 203, పూడిమడకలోని 228 కేంద్రం పరిధిలోని బీఎల్వోలు ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారికి నోటీసులు జారీ చేశారు.

Similar News

News January 10, 2026

తిరుమల శ్రీవారికి ఆయుధాలు లేవా?

image

తిరుమల శ్రీవారు ఆయుధాలు లేకుండా దర్శనమిస్తారు. దీనికొక పురాణ గాథ ఉంది. పూర్వం సింహాద అనే రాక్షసుడిని సంహరించడానికి శ్రీనివాసుడు తన శంఖుచక్రాలను తొండమాన్ చక్రవర్తికి ఇచ్చారు. ఆయన ఆయుధాలు లేకుండానే స్వామివారు భక్తులకు దర్శనమివ్వాలని కోరారు. భక్తుడి కోరిక మేరకే మూలవిరాట్టుకు ఆయుధాలు ఉండవు. ప్రస్తుతం ఉన్న శంఖుచక్రాలు భక్తులు సమర్పించిన ఆభరణాలు. అసలు ఆయుధాలు తిరుమలలోని వివిధ తీర్థాలుగా వెలిశాయి.

News January 10, 2026

పల్నాడు: జంగా కృష్ణమూర్తికి సీఎం పిలుపు

image

TTD పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తికి CM కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన నిన్ననే మీడియా ముఖంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన రాజీనామాను సీఎం చంద్రబాబు, TTD ఛైర్మన్ BR నాయుడు ఆమోదించాలని ఆయన విన్నవించారు. ఈ పరిణామంపై తక్షణమే స్పందించిన చంద్రబాబు.. చర్చించేందుకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా జంగా కృష్ణమూర్తికి కబురు పంపారు.

News January 10, 2026

NRPT: జాతీయస్థాయి సైక్లింగ్‌కు అంబిక

image

కృష్ణ మండలం ముడుమాల్ గ్రామానికి చెందిన అంబిక జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించి ఆర్థిక సాయం అందజేశారు. అంబిక అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సర్పంచ్, వార్డు సభ్యులు ఆకాంక్షించారు. విద్యార్థులందరినీ ఇదే రీతిలో ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.