News January 28, 2025

అనకాపల్లి బెల్లం విక్రయాలు.. ఇదే తొలిసారి..!

image

అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో సోమవారం రికార్డు స్థాయిలో బెల్లం విక్రయాలు జరిగాయి. పలు గ్రామాల నుంచి రైతులు రూ.15,776 బెల్లం దిమ్మలను మార్కెట్టుకు తీసుకువచ్చి విక్రయించారు. ఈ సీజన్‌లో భారీ స్థాయిలో బెల్లం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే బెల్లానికి డిమాండ్ లేకపోవడంతో ధరలు బాగా తగ్గాయని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

జేఈఈ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు

image

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పేపర్-2లో తెలుగు తేజాలు మెరిశాయి. పేపర్ 2ఏలో TGకి చెందిన శ్రేయస్ రెడ్డి 99.99 పర్సంటైల్.. ఏపీ నుంచి శరణ్య అశ్విని 99.95 స్కోర్ సాధించారు. పేపర్ 2బీలో TG నుంచి నాగ ప్రద్యుమ్న రెడ్డి 99.98, ఏపీలో హర్షాదిత్య, ఈశ్వర్ రాజ్, భీమ తులిప్ 99.95 స్కోర్ చేశారు. కేరళకు చెందిన సూర్యతేజస్, గౌరీశంకర్ మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. కాగా సెషన్-2 రిజిస్ట్రేషన్‌కు రేపే లాస్ట్ డేట్.

News February 24, 2026

NZB: అరైవ్ అలైవ్ వారోత్సవాలు.. విద్యార్థులకు అవగాహన

image

రోడ్డు ప్రమాదాల నివారణలో ముందస్తు అవగాహనే అత్యంత కీలకమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. అలైవ్ అరైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు అంబాసిడర్‌గా ఉండి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News February 24, 2026

శ్రీకాకుళంలో డయేరియా కలకలం

image

AP: రాజమండ్రి <<19216426>>కల్తీ<<>> పాల ఘటన మరువక ముందే శ్రీకాకుళంలో భారీగా డయేరియా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ఈరోజు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఒక్కరోజే 25 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 76కు చేరింది. బాధితులు జీజీహెచ్, కిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని <<19224272>>సీఎం<<>> ఇప్పటికే అధికారులకు సూచించారు.